వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిని ముఖ్యమైన పాత్రల్లో కొనసాగించడం పట్ల పార్టీ లోపల మరియు బయట విమర్శలు ఉన్నప్పటికీ, ఆయనపై తన నమ్మకాన్ని కొనసాగిస్తున్నారు.
పార్టీ నేతలకు,సజ్జలకు మధ్య పెద్ద అగాధమే ఉంది. సజ్జల, జగన్ మధ్య “ఐరన్ కర్టెన్”లా వ్యవహరిస్తున్నారని, ఇతర నేతలు జగన్‌ను నేరుగా కలవలేకపోతున్నారని విమర్శలు ఉన్నాయి . 2024 ఎన్నికల్లో పార్టీ పరాజయానికి సజ్జల నిర్ణయాలు, సీట్ల కేటాయింపు, ప్రచార వ్యూహాలు కారణమని చలా వరకు ఆ పార్టీ నేతలు,కార్యకర్తలు భావిస్తున్నారు .
సజ్జల పై కార్యకర్తలు,స్థానిక నేతలు వ్యతిరేకంగా ఉండటానికి ప్రధాన కారణం, తమ సమస్యలు ఆయన ముందుకు తీసుకెళ్లినప్పుడు సజ్జల నుండి తగిన స్పందన రాకపోవడం.టికెట్ల పంపకాల్లో, పదవుల పంపకాల్లో సజ్జల పాత్రపై కార్యకర్తలు,నాయకుల్లో అసంతృప్తి ఉంది. తమకు న్యాయం జరగలేదని భావించారు.
సజ్జల మాట తీరులో అహంకారం,అధికార ధోరణి కనిపిస్తుంది. స్వచ్చందంగా పని చేసిన వైసిపి సొషల్ మీడియా అభిమానులను, అతను మురుగు కుంటతో పోల్చాడు.మొదటి నుండి జగన్ కోసం,పార్టీ కోసం కస్టపడిన వారిని కాదని,పదవులులన్ని తనకు అవసరమైన వారికి,తనకు బాకాలూదేవారికి ఇచ్హుకున్నాడనేది జగనెరిగిన సత్యం. వైసిపి సోషల్ మీడియా స్థబ్ధుగా ఊండటానికి ఇది ప్రధాన కారణం.